How Long Can Corona Virus Survive In a Dead Body ? | Nelloriens | Nellorerockss | NELLORE
How Long Can Corona Virus Survive In a Dead Body ?
Ee Question ipudu all most andariki Unde Question
Ipudu manam Aa Question ki answer Thelsukundham
Let's Start
How Long Can Corona Virus Survive In a Dead Body ?
*చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు సజీవంగా ఉంటుంది? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ గతఏడాది కాలంగా అధ్యయనం చేసింది. అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్త ఆసక్తికర విషయాలను తెలిపారు.*
*కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను ప్రభావితం చేస్తోంది. అందరూ ఉన్న ఎవరూ దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే చనిపోయినా కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఐతే.. చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశంతో ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్.. ఏడాది కాలంగా అధ్యయనం చేపట్టింది. కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12నుంచి 24 గంటల తర్వాత కరోనా వైరస్ బతకలేదని.. ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్త తెలిపారు.*
*తర్వాత నెగెటివే..*
*దాదాపు వందకు పైగా కరోనా శవాలను పరీక్షించామన్న ఆయన.. మృతదేహాలకు మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. మృతదేహాల నుంచి.. వైరస్ వ్యాప్తి జరగడానికి అవకాశం చాలా తక్కువని పేర్కొన్నారు. ముందస్తు రక్షణలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలు, శరీరం నుంచి ద్రవాలు స్రవించే ప్రదేశాలను.. మూసి వేయడం, రోగికి అమర్చిన వివిధ పైపులను.. శానిటైజ్ చేయాలని సూచించారు. కరోనా పాజిటివ్‌తో చనిపోయిన మెడికో-లీగల్ కేసులను పరీక్షించడం ద్వారా.. ఈ విషయాలను గుర్తించినట్లు తెలిపారు.*
*జాగ్రత్తలు తప్పనిసరి..*
*ఐతే.. అంత్యక్రియల్లో పాల్గొనే వారు ముందస్తు రక్షణగా కచ్చితంగా మాస్క్‌లు, చేతికి గ్లౌవ్స్, పీపీఈ కిట్లు ధరించాలన్నారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం.. చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షితమేనని తెలిపారు.ఆ సమయంలో కరోనా వ్యాప్తికి ఆస్కారమే లేదన్నారు. మే 2020లో కొవిడ్-19 మృతదేహాలకు సంబంధించి పోస్ట్‌మార్టం చేయడంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలను విడుదల చేసింది.కరోనా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. పోస్ట్‌మార్టం చేయడం ద్వారా..మార్చురీ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల జీవితాలను.. ప్రమాదంలోకి నెట్టినట్లు అవుతుందని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో పోస్ట్‌మార్టం చేయాల్సి వస్తే.. సరైన రక్షణతో వీలైనంత తక్కువ పనితో ఆ తంతు ముగించాలని తెలిపింది.*
For English Candidates :
* How long is the corona alive in a dead person? This is a question that is bothering many people right now. The AIIMS Department of Forensic Medicine has been studying the answer to this question for the past year. Aims forensic chief Dr Sudhir Gupta, who revealed the results of the study, said interesting things. *
* The corona epidemic is affecting the lives of many. The situation was such that no one could come near everyone. No one comes forward to conduct the funeral for fear of Corona even if her own family member dies. However, the AIIMS Department of Forensic Medicine conducted a year-long study with the intention of honoring the dead. Dr. Sudhir Gupta, AIIMS forensic chief, said the corona virus did not survive after 12 to 24 hours in the nose and body of the man who died of Covid. *
* Negative later .. *
* He has examined more than a hundred corona corpses. From the dead .. The chances of the virus spreading are very low. As part of precautionary measures, the body is advised to sanitize the nostrils, the areas where fluids are secreted from the body, and the various pipes fitted to the patient. By examining the medico-legal cases of deaths with corona positives .. these things were identified. *
* Precautions are mandatory .. *
* So .. Funeral attendees must wear masks, gloves and PPE kits as a precaution. After the funeral, he said it was completely safe to collect the ashes, adding that there was no room for the corona to spread at that time. In May 2020, the ICMR issued guidelines on the postmortem of Kovid-19 corpses. By post-mortem, the lives of mortuary employees, doctors and police will be endangered. If post-mortem is required under mandatory conditions, the cable should be terminated with as little work as possible with proper care.
[#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl
Follow Us On
Facebook - Nelloriens
Instagram - Nelloriens
Twitter - Nelloriens
YouTube - Nelloriens
Telegram - Nelloriens
No comments
Thank u For Your Comment