కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు | New diseases after corona reduction | Nelloriens | Nellorerockss | Nellore | Spsrnellore

కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు



Ipudu matter enti ante chaala mandhiki Covid positive vachhi treatment thiskoni aa tharvatha Negative vachesindi ani silent aipotharu ! 

So ila aipodam valla manaki thelikundane Mana Body lo chaala ante Chaala Health problems & Mental Problems face cheyyalsivasthundi 

So ipudu manam Covid positive tharvatha vachhe mana Health problems gurinchi oka look veddham 

Let's Go.....





*ఏపీ కోవిడ్-19*
*కమాండ్ కంట్రోల్*
***************************** 
*కరోనా తగ్గిన తర్వాత కొత్త రోగాలు - జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు*

కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. అయితే వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్నామని కాస్త కుదుటపడేలోపే చాలా మందిలో షుగర్‌‌‌‌, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్‌‌, హార్ట్ ఎటాక్‌‌ వంటి జబ్బులొస్తున్నాయి. బ్లాక్​ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంత మందిలో కిడ్నీలు పాడవడం, అర్థరైటీస్‌‌, థైరాయిడ్ వంటి జబ్బులూ కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయిన సగం మందిలో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లోనూ టైప్ వన్ డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కార్పొరేట్‌‌, ప్రైవేట్ ఆస్పత్రులకు వందలాది మంది పేషెంట్లు వెళ్తున్నారు.  

*ఇమ్యూనిటీ సిస్టమ్ అతిగా స్పందించడంతోనే..!*

మన శరీరంలోకి కరోనా వైరస్ ​ప్రవేశించగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ సిద్ధమవుతుంది. వెంటనే యాంటిబాడీల‌‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొంత మందిలో రోగనిరోధక శక్తి అతిగా స్పందించడం వల్ల, సైటోకైన్ స్టార్మ్ ఏర్పడి లెక్కలేనన్ని యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి కరోనాతో పాటు, మన శరీరంపైనా దాడి చేస్తున్నాయి. దీని వల్లే బ్లడ్ క్లాట్స్, టిష్యూ డ్యామేజ్ వంటి పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల రక్తప్రసరణ దెబ్బతిని గుండె పోటు వంటి ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయి. ఈ యాంటీబాడీస్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేసేందుకు ఇమ్యూనిటీని తగ్గించే స్టెరాయిడ్స్‌‌‌‌‌‌‌‌ను వాడాల్సి వస్తోంది. అప్పటివరకూ స్టెరాయిడ్స్ ఉపయోగపడినా, అటు తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మ్యూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కరోనా సోకిన చాలా మందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. కొన్ని రోజుల పాటు తక్కువ ఆక్సిజన్​లెవల్స్‌‌‌‌‌‌‌‌తోనే నెట్టుకొస్తున్నారు. దీంతో గుండెకు, ఊపిరితిత్తుల‌‌‌‌‌‌కు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆక్సిజన్ తగ్గడంతో ఆ ప్రభావం గుండె కండరాలపై పడడంవల్ల కొంత మంది గుండెపోటు వచ్చి చనిపోతున్నారని కార్డియాలజిస్టులు చెప్తున్నారు. చాలా మందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల‌‌‌‌‌‌‌ పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడడం లేదు. ఇలాంటివారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందేనని పల్మనాలజిస్టులు సూచిస్తున్నారు.

*షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దీర్ఘకాలిక ఇబ్బందులే*

కరోనా సోకిన చాలా మందిలో డయాబెటీస్ సమస్య కూడా వస్తోంది. కేవలం కరోనాతోనే కొంత మంది డయాబెటీస్ పేషెంట్లుగా మారుతున్నారు. అంతకు ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనాతో షుగర్ లెవల్స్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా పెరుగుతున్నాయి. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌పై కరోనా ఎటాక్ చేయడం వల్లే ఇలా జరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌లో ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేసే బీట కణాలు ఉంటాయి. వైరస్ ఈ కణాల్లోకి చొరబడి, వాటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి తగ్గిపోవడం/ఆగిపోవడం జరుగుతోందని డాక్టర్లు  అంటున్నారు. దీంతో బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చక్కెర లెవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమాంతం పెరుగుతున్నాయి. కరోనా తర్వాత కొన్ని రోజులకు షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్స్ తగ్గుతున్నా, పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. కొంత మందిలో షుగర్ ఉన్నా, కరోనా తర్వాత ఆ విషయం బయటపడుతుండగా, ఇంకొంత మంది కరోనా కారణంగానే షుగర్ బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లోనూ ఈ సమస్య తలెత్తుతోందని డాక్టర్లు చెప్తున్నారు. 

*పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్*

కరోనా సోకిన పిల్లల్లో కొంతమంది టైప్ వన్ డయబెటీస్ కు గురవుతున్నారు. పాంక్రియాజ్‌‌‌‌‌‌‌‌పై కరోనా దాడి చేయడంవల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతోంది. ఇక జీవితాంతం ఇలాంటివాళ్లు ఇన్సులిన్‌‌‌‌‌‌‌‌ వాడాల్సిందే. అయితే, ఇది చాలా అరుదుగా, కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తోంది. పెద్ద వాళ్లలో మాత్రం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. షుగరే కాదు.. పోస్ట్‌‌‌‌‌‌‌‌ వైరల్ రియాక్టివ్ అర్థరైటీస్‌‌‌‌‌‌‌‌, థైరడైటీస్‌‌‌‌‌‌‌‌ వంటి సమస్యలు కూడా వస్తున్నయి. 

*50% మందిలో యాంగ్జయిటీ*

కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకుని ఇంటికెళ్లిన చాలా మంది పోస్ట్ ట్రామాటిక్ స్ర్టెస్ డిజార్డర్స్‌‌‌‌‌‌‌‌తో బాధ పడుతున్నారు. సగం మందిలో యాంగ్జయిటీ కనిపిస్తోంది. నిద్రపట్టకపోవడం, సూసైడల్ థాట్స్‌‌‌‌‌‌‌‌, అడ్జస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్‌‌‌‌‌‌‌‌ వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేసినవాళ్లూ ఉన్నారు. ఇవన్నీ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. కరోనా పేషెంట్ల విషయంలో ఇంట్లో వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
*రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి* 

కరోనా ఎక్కువగా మన శరీంలోని రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇమ్యూనిటీ లేకపోవడంతో నీరసం, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే వైద్యులు సూచించిన మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో అన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్‌ వంటివి రోజూ తీసుకోవాలి. షుగర్‌‌, బీపీ రెగ్యులర్‌‌గా చెక్ చేయించుకోవాలి. గుండె, మెదడు సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. కరోనా రీఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్, పరిశుభ్రత, భౌతికదూరం.. ఈ మూడు విషయాలు  తప్పకుండా పాటించాలి. 

*రక్తం గడ్డకట్టడమే సమస్య*

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ‌ సమస్యలతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్తున్నారు. రక్తంలో ఏర్పడుతున్న క్లాట్స్‌‌తోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రక్త నాళాల్లో క్లాట్స్‌‌ ఏర్పడి, బ్లడ్ ప్రెజర్ తగ్గుతోంది. గుండెకు, మెదడు‌కు రక్త ప్రసరణ సరిగా లేకపోతే స్ట్రోక్, ఇతర సమస్యలు వస్తాయి. కరోనా పేషెంట్లలో జరుగుతున్నది ఇదే. కిడ్నీల పరితీరు దెబ్బతినడానికి కూడా ఇదే కారణం. ఊపిరితిత్తులకు ఆక్సిజన్, రక్తం సరఫరా ఆగిపోయి లంగ్ ఫైబ్రోసిస్ వస్తోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన తర్వాత కూడా డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకోవాలని పేషెంట్లకు సూచిస్తున్నారు. బ్లడ్ క్లాట్స్‌‌ అవుతున్నాయా, లేదా అనేది డీడైమర్ వంటి టెస్టుల ద్వారా  ముందే గుర్తించొచ్చని వైద్యులు అంటున్నారు. 

*కరోనా తర్వాత ఇవీ సమస్యలు*

* కొందరిలో కరోనా తగ్గాక డయాబెటీస్ సమస్య వస్తోంది. ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనా వల్ల షుగర్ లెవల్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి.

* మరికొందరిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడం లేదు.  కిడ్నీల పనితీరు కూడా సరిగా ఉండడం లేదు.

* మరికొందరిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో గుండెకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆ ప్రభావం గుండె కండరాలపై పడి గుండె పోటు వస్తోంది. 

*నిద్రపట్టకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, అడ్జస్ట్​మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్‌ వంటి ఇబ్బందులతో కొందరు బాధపడుతున్నారు.

*చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ వాడిన వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల మ్యూకర్‌‌ మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.

************************
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*


For English Pillalu ;


Command Control *
*******************************
* New diseases after corona reduction - doctors to be careful *

The number of people recovering from corona infection is huge. However, medical professionals need to take extra precautions even after recovering from the virus. Many people suffer from diseases like diabetes, BP, lung fibrosis and heart attack before they can recover from corona. Fungal infections like black fungus, candida, bacterial infections are coming. Some people have kidney damage, arthritis and thyroid disease. Post-traumatic disorders are now more common in half of those discharged from hospitals. Doctors say that children who are seriously ill with corona are also more likely to develop chronic diseases such as type one diabetes. Hundreds of patients are still going to corporate and private hospitals after recovering from corona.

* As soon as the immune system overreacts ..! *

As soon as the corona virus enters our body, our immune system prepares to fight it. Immediately produces antibodies. However, due to the overreaction of the immune system in some people, the cytokine storm is formed and innumerable antibodies are produced. These attack our body, along with the corona. This can lead to many problems such as blood clots and tissue damage. These blood clots can damage the bloodstream and cause life-threatening illnesses such as heart attack. Immunosuppressive steroids are being used to bind to these antibodies. Until then, steroids have been used, but then fungal infections such as mucomycosis are caused by a decrease in immunity. Oxygen levels are dropping in many people with corona infection. Staying with low oxygen levels for a few days. As a result, the heart and lungs do not receive enough oxygen. Cardiologists say that some people die of heart attack due to the effect of oxygen deprivation on the heart muscle. In most people, lung function does not fully improve even after recovery from the corona. Pulmonologists suggest that such people take special care.

* Long-term problems with sugar *

Diabetes is also a problem in many people with corona infection. Some people become diabetic patients with corona alone. Sugar levels with corona are rising exponentially in people with pre-diabetes. Doctors say this is due to a corona attack on the pancreas. The pancreas contains beta cells that produce insulin. The virus is infiltrating these cells and destroying them. Doctors say that this causes the insulin production to decrease / stop. This causes the blood sugar levels to rise abruptly. Although sugar levels drop for a few days after corona, there is no complete control. Some people have sugar, while the corona after that thing comes out, while others are becoming sugar victims because of the corona. Doctors say that this problem also arises in children.

* Type one diabetes in children *

Some of the children with corona infection are suffering from type one diabetes. Insulin production is completely stopped due to corona attack on the pancreas. People like this have to use insulin for the rest of their lives. However, this rarely, if ever, appears in some cases. Larger cases are more common in older people. Sugar is not .. Post-viral reactive arthritis, thyroiditis, such problems are also coming.

* Anxiety in 50% of people *

Many people who go home with corona treatment suffer from post-traumatic stress disorder. Anxiety appears in half of people. Suffering from insomnia, suicidal thoughts, adjustment problems and loneliness. There were also those who attempted suicide because they could not bear the pressure. All of this is taking a long time to subside. They need to be very careful at home when it comes to corona patients.
 
* Increase immunity *

The corona mostly has a profound effect on our body’s immune system. Lack of immunity leads to many problems such as boredom, cramps and insomnia. To get rid of these, you need to take rest using the medicines prescribed by the doctors. Be careful when it comes to food. Make sure you have all kinds of ingredients in your diet. Fruits, such as dry fruits, should be taken daily. Sugar and BP should be checked regularly. People with heart and brain problems need to be more vigilant. See a doctor immediately if you feel uncomfortable. Mask, hygiene, physical distance .. These three things must be followed to prevent corona re-infection.

* Blood clots are the problem *

Many people go to hospitals with lung, heart and kidney problems after recovering from the corona. All of these problems come with clots forming in the blood. Clots form in the blood vessels and blood pressure decreases. Stroke and other problems can occur if the blood circulation to the heart and brain is not good. This is exactly what is happening in corona patients. This is also the reason for the deterioration of kidney function. Oxygen and blood supply to the lungs stops and lung fibrosis occurs. Patients are advised to consult a doctor and seek advice even after discharge from the hospital. Doctors say that blood clots can be detected in advance by tests such as a dehumidifier.

* These are the problems after corona *

* Diabetes is a problem that affects the corona in some people. Corona causes elevated sugar levels in people with pre-diabetes.

* In others, lung function does not improve even after recovery from the corona. Kidney function is also not functioning properly.

* Oxygen levels in others are dropping. As a result, the heart does not get enough oxygen. That effect falls on the heart muscle and causes a heart attack.

* Some people suffer from insomnia, suicidal ideation, adjustment problems, and loneliness.

* Fungal infections such as mucosal mycosis are caused by a weakened immune system in those who have used steroids during treatment.

************************
* Dr. Arja Srikanth *
* State Nodal Officer, Kovid-19 *






Follow Us On 

Facebook - Nelloriens 
Instagram - Nelloriens 
Twitter -  Nelloriens 
YouTube - Nelloriens 
Telegram - Nelloriens


#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl 

No comments

Thank u For Your Comment

Powered by Blogger.