Krishnapatnam Lo Corona Case lu | Nelloriens | NELLOREOCKSS | Nellore







*💥కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు*




*💥కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు*

*వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!*

*ఆయుర్వేద మందు పంపిణీలో పని చేసిన వ్యక్తికే కరోనా  పాజిటివ్.*

*కృష్ణపట్నం గ్రామంలో కలకలం రేపుతున్న పాజిటివ్ కేసులు.*

*గ్రామంలో మిగిలిన వారికి కూడా టెస్టులు చేయాలంటున్న స్థానికులు.*

*ముత్తుకూరు:* కరోనా వైరస్ నివారణకు ఆయుర్వేద మందు తయారీకి నిలయంగా ఉన్నటువంటి కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.దీంతో ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు.నాటు వైద్యం అందిస్తున్న ఆనందయ్య మందు ఇక్కడ తయారైన నేపథ్యంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. శనివారం కృష్ణపట్నం గ్రామ సచివాలయం నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఆ శాఖ సిబ్బంది టెస్టు నిర్వహించగా ఒకే ఫ్యామిలీ లో ముగ్గురు కి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించడం జరిగింది. ఐదు మందికి ఈ రాపిడ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక్కసారిగా ప్రపంచస్థాయిలో కృష్ణపట్నం పేరు మారుమూల సంచలనం సృష్టించగా ఇదే రీతిలో ఇక నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంచలనం కానున్నాయి. ఎక్కడెక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయుర్వేదం వైద్యులుగా పిలవబడుతున్న ఆనందయ్య మందు కోసం ఇక్కడ జనం వస్తుంటే స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఈ పరిణామం  ఎక్కడికి దారి తీస్తుందో నని జనం భయపడిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన రాపిడ్ టెస్టుల్లో ఒక్కరోజులోనే మూడు కేసులు నమోదు చేయడంపై ఆ శాఖ అధికారులు ఆలోచనలో పడి మల్లగుల్లాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబంలో ఆనందయ్య వైద్యం పొంది ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన మందు తిని కూడా కరోనా వైరస్ సోకడం పట్ల స్థానికులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చర్చించుకుంటున్నారు.
..............................................
ఆయుర్వేదం మందు పంపిణీ పక్రియలో పనిచేసిన వ్యక్తికి పాజిటివ్.
..............................................
కృష్ణపట్నం గ్రామంలో ఆయుర్వేదం మందు పంపిణీ పక్రియలో సహకారం అందించిన వ్యక్తికి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా నిర్ధారణ కావడం పట్ల ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆయనతో పాటు ఆ కుటుంబంలోని భార్య పిల్లలకు ఈ వైరస్ సోకిన ట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం మందు పంపిణీ పక్రియలో పనిచేసిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా టెస్ట్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల ముగిసే కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గ్రామ పరిస్థితి ఏమవుతుందో అని గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కచ్చితంగా అధికారులు రాపిడ్ టెస్ట్ నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి పది రోజుల క్రితం స్థానికంగా జరిగిన ఆయుర్వేద మందులు పంపిణీ ఈ ప్రక్రియలో కరోనా పాజిటివ్ రోగులకు కంటిలో డ్రాప్స్ వేసి  సేవా కార్యక్రమం చేసినట్లు తెలిసివచ్చింది.




For English Medium Pillalu : 



* Corona positive cases in Krishnapatnam *

* Medical Health Department Rapid Tests Released  *

* Corona positive for a person who has worked in Ayurvedic medicine distribution. *

* Positive cases in Krishnapatnam village. *

* Locals who want to do tests for the rest of the village as well. *

* Muthukuru: * Corona positive cases are being registered in Krishnapatnam gram panchayat which is home to the manufacture of ayurvedic medicine for the prevention of corona virus. With this, the people of this village are in a state of panic. Rapid tests were conducted under the auspices of the Medical Health Department at the Krishnapatnam Village Secretariat on Saturday. The department staff conducted a test and confirmed that three members of the same family were infected with the corona virus. Five people underwent the rapid test and three tested positive, according to government medical health officials. Once upon a time, the name Krishnapatnam created a sensation in the world and in the same way, the number of corona positive cases is going to be a sensation. If people come here for long-distance travel from far-flung places to other states for the so-called Ayurvedic medicine, people are worried about where the corona virus will spread locally and positive cases will come. Officials of the medical health department are scrambling to register three cases in a single day in the rapid tests conducted by the department. Coronavirus appears to have received Anandayya healing in a family with positive cases registered. Even after he took the drug, the locals are discussing the corona virus infection one by one.
..............................................
 positive for a person who has worked in the Ayurvedic distribution process.
..............................................
The issue has led to a large-scale debate over whether a person who assisted in the distribution of Ayurvedic medicine in Krishnapatnam village was positively diagnosed with the corona virus. He and his family's wife and children were infected with the virus, medical health officials told the media. In this context, the locals are demanding that the medical health department conduct a corona test on all those who have worked in the Ayurvedic drug distribution process. As the month draws to a close, the villagers are left wondering what will happen to the village as each of the corona positive cases comes to light. Certainly the people want the government to conduct a rapid test by the authorities. It was learned that a person with corona positive infection had done a service program by putting eye drops for corona positive patients in the process of distributing ayurvedic medicines locally ten days ago.


Follow Us On 

Facebook - Nelloriens 
Instagram - Nelloriens 
Twitter -  Nelloriens 
YouTube - Nelloriens 
Telegram - Nelloriens


#Nellore #nelloreinfo #Nelloriens #Nellorerockss #Spsrnellore #nellorecity #NelloreVRC #nelloreupdates #Nelloreroads #Nellorepeople #Nellorespl 

No comments

Thank u For Your Comment

Powered by Blogger.